NRPT: పేదలకు సంక్షేమ ఫలాలు అందించి అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మార్కెట్ ఛైర్మన్ రాంపూర్ శివారెడ్డి అన్నారు. నారాయణపేట మండలం పేరపళ్లలో బుధవారం ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. సొంతిల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు, ఉపసర్పంచ్ మోహన్, వార్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: శివారెడ్డి


