హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ప్రభంజనం సృష్టించనున్న జై కొట్టు నినాదం'

VZM: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ అధికారిక యువజన విభాగానికి జై కొట్టు అని నామకరణం చేసి, దాని లోగోను పిఠాపురంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా విజయనగరంలో జనసేన నాయకులు అవనాపు విక్రమ్ మాట్లాడుతూ.. ఈ జై కొట్టు నినాదం రాబోయే రోజులలో ప్రభంజనం సృష్టించనున్నదన్నారు. యువత తమ భవిష్యత్తు కోసం పిడికిలి బిగించి జై కొట్టాలన్నారు.