హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగం వర్షిత్ తల్లికి బండి సంజయ్ పరామర్శ

బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిలో గాయపడిన ఆయన తల్లిని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నాగం కుటుంబానికి బీజేపీ  పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ దాడిని, వస్తువుల ధ్వంసం ఘటనను బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు.