హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక విగ్రహాల వద్ద విద్యుత్ జాగ్రత్తలు.!

KMM: వినాయక చవితి వేడుకల సందర్భంగా విగ్రహాల విక్రయం, రవాణాలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని టీజీఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి సూచించారు. విగ్రహాల ఎత్తు విద్యుత్ వైర్లకు తగలకుండా సురక్షిత దూరం పాటించాలన్నారు. అత్యవసర సమయాల్లో టోల్‌ఫ్రీ 1912కు సంప్రదించాలని కోరారు.