BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో శ్రావణమాసాన్ని పురస్కరించుకుని బుధవారం పోచమ్మ బోనాల ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తెలంగాణ
భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాలు


