హైదరాబాద్: 28°C
క్రీడలు

లింక్డ్‌ఇన్‌లో పాక్ కోచ్ వేట.. నెటిజన్ల ట్రోల్స్‌

వరుస ఓటములతో సతమతమవుతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ జట్టుకు ఫీల్డింగ్ కోచ్ కావాలంటూ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ పెట్టి నెటిజన్ల ట్రోల్స్‌కు గురవుతోంది. 'క్రికెట్ ఆడనందున నేనొక్క క్యాచూ వదలలేదు, అప్లై చేయొచ్చా' అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. మూడేళ్లలో ఆరుగురు కోచ్‌లను మార్చిన పీసీబీ తీరు, సెలక్టర్లకు నోటీసులతో జట్టులో అనిశ్చితి నెలకొంది.