హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాలలో పోలీసుల పెట్రోలింగ్

BPT: చీరాల 10వ వార్డు ఉడ్నగర్ చర్చ్ కాంపౌండ్ ప్రాంతంలో వన్ టౌన్ సీఐ సోమశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రజలు భయం లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని భరోసా ఇచ్చారు. అల్లర్లు సృష్టించినా, ఓటర్లను ప్రలోభపెట్టినా కఠిన చర్యలు ఉంటాయని సీఐ హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 112కి సమాచారం ఇవ్వాలని కోరారు.