కృష్ణా: గన్నవరం (M) సూరంపల్లిలో ధాన్యం బకాయిల కోసం కౌలు రైతుల రిలే నిరాహార దీక్షలు బుధవారం కొనసాగాయి. ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. హరిబాబు, జిల్లా కార్యదర్శి పంచకర్ల రంగారావు దీక్షలకు మద్దతు తెలిపారు. రూ.6.80 లక్షల బకాయిలను వెంటనే చెల్లించాలని హరిబాబు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
కౌలు రైతుల రిలే నిరాహార దీక్షలు


