హైదరాబాద్: 28°C
తెలంగాణ

22ఏ జీవో రద్దుకు ధర్నా: ఎంపీ

MDK: 22ఏ జీవో పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములను కబ్జా చేసే కుట్ర చేస్తోందని ఎంపీ రఘునందన్‌రావు ఆరోపించారు. జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నర్సాపూర్‌లో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణితో రైతులను ముంచితే, ప్రస్తుత ప్రభుత్వం భూభారతితో నరకం చూపుతోందన్నారు. పేదల హక్కుల కోసం పోరాడేది ఒక్క బీజేపీయేనని స్పష్టం చేశారు.