హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్లస్టర్‌ సీసీలకు షోకాజ్ నోటీసులు

BPT: పర్చూరు మండల వెలుగు కార్యాలయంలో బుధవారం జిల్లా ప్రాజెక్ట్‌ డైరెక్టర్ ప్రగతి సమీక్ష నిర్వహించారు. రుణాల మంజూరులో స్త్రీనిధి 20%, ఉన్నతి 30%, బ్యాంకు లింకేజీ 70% మాత్రమే సాధించి మండలం వెనుకబడి ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా ఉన్న పర్చూరు, చెరుకూరు, వీరన్నపాలెం క్లస్టర్‌ సీసీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.