హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు కుటుంబానికి కిరాణా దుకాణం ఏర్పాటు

SRD: కోహీర్ మండలం మాచిరెడ్డిపల్లిలో 13 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు అంజయ్య కుటుంబానికి గ్రామ రైతు స్వరాజ్య సంస్థ అండగా నిలిచింది. బుధవారం కుటుంబానికి కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేసి జీవనోపాధికి మార్గం చూపింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు సహకరించిన సంస్థకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.