అన్నమయ్య: బీసీ హక్కుల పోరాట సమితి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఏ.రెడ్డెప్పపై జరిగిన దాడిని బీసీహెచ్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బోడెం రాజశేఖర్ తీవ్రంగా ఖండించారు. దాడిలో రెడ్డెప్పకు గాయాలయ్యాయని, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి'


