BDK: పినపాక మండలం ఏడూళ్లబయ్యారం ZPHSలో మండలస్థాయి క్రీడా పోటీల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఎంఈఓ కొమరం నాగయ్య ఆధ్వర్యంలో హెచ్‌ఎంలు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ నెల 17 నుంచి జానంపేట జడ్పీహెచ్‌ఎస్‌లో అండర్-14, అండర్-17 బాలబాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
మండలస్థాయి క్రీడలపై సమావేశం


