హైదరాబాద్: 28°C
క్రీడలు

రేపు బీసీసీఐ మీటింగ్.. రోహిత్ భవిష్యత్తుపై చర్చ?

ముంబై వేదికగా రేపు జరగనున్న బీసీసీఐ కీలక సమావేశంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొననున్నారు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో జట్టు వైఫల్యాలపై ఈ భేటీలో సమీక్షించనున్నారు. అలాగే రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తు, 2027 ప్రపంచకప్ ప్రణాళికలు, ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.