హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సచివాలయంలో MPDO ఆకస్మిక తనిఖీ

కృష్ణా: గుడ్లవల్లేరు (మం) కౌతవరం గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో ఇమ్రాన్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయంలోని పరిపాలనా రికార్డులు, సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, వివిధ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను పరిశీలించారు. సచివాలయానికి వచ్చే ప్రజలకు ప్రభుత్వ సేవలను ఎటువంటి జాప్యం లేకుండా అందించాలని సిబ్బందికి సూచించారు.