NRML: కోతుల్‌గావ్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని అస్థిపంజరం లభ్యమైంది. ఘటన స్థలంలో పుర్రెతో పాటు కొన్ని ఎముకలు లభించాయి. గత 4–5 నెలలుగా మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి సంచరిస్తూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. ఎస్సై సుప్రియ పంచనామా నిర్వహించి, ఎముకలను పరీక్షల కోసం భద్రపరిచారు. సర్పంచ్ భూమేష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
గుర్తు తెలియని ఆస్తిపంజరం లభ్యం


