ASF: ఆసిఫాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆవరణలో జనరిక్ మెడికల్ షాప్ నిర్వహించేందుకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ కిరణ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. రూ.50 దరఖాస్తు రుసుముతో సెప్టెంబర్ 3 నుంచి 7 వరకు GGH కార్యాలయంలో ఫారాలు పొందవచ్చన్నారు. దరఖాస్తులను సెప్టెంబర్ 7 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలన్నారు.
తెలంగాణ
జనరిక్ మెడికల్ షాప్ నిర్వహణకు ఆహ్వానం


