VKB: రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. బీసీలకు రాజకీయ, ఉద్యోగ, విద్యా రంగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ప్రభుత్వం బీసీల పట్ల తన వైఖరిని మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.
తెలంగాణ
'42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు '


