హైదరాబాద్: 28°C
తెలంగాణ

దవాఖానలు నిబంధనలు పాటించాలి: డా. లలితా దేవి

SRD: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు కచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితా దేవి స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రైవేట్ దవాఖానాలపై నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని, వైద్య సేవల ధరల వివరాల బోర్డులను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు.