హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముమ్మరంగా జలసిరి పనులు

SDPT: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం చేపట్టిన జలసిరి పథకం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా దౌల్తాబాద్ మండలం రంగంపేటలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. భూమిలోకి నీటిని ఇంకించేలా పనులు నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా భూగర్భ జలమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.