హైదరాబాద్: 28°C
తెలంగాణ

అలంపూర్‌లో విద్యార్థులకు రాఖీల వితరణ

GDWL: అలంపూర్‌లో రక్షాబంధన్ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు రాఖీల వితరణ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం పట్టణంలోని హరిజనవాడ స్కూల్, గర్ల్స్ హైస్కూల్, గాంధీ హైస్కూల్‌లో విద్యార్థులకు రాఖీలు అందించారు. 'నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష.. మనమిద్దరం కలిసి దేశానికి రక్ష' అనే సందేశంతో విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకున్నారు.