హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా యువతకు విదేశాలలో ఉద్యోగ అవకాశాలు

PDPL: జిల్లా నిరుద్యోగ యువతకు TOMCOM-సంస్థ ఆధ్వర్యంలో జర్మనీ, ఇజ్రాయిల్, ఆస్ట్రియా, ఐర్లాండ్, సౌదీ అరేబియా, ఖతార్, దుబాయ్ దేశాలలో వివిధ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి రాజశేఖర్ ఇవాళ తెలిపారు. అర్హత, ఆసక్తిగలవారు కలెక్టరేట్‌లోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 8125737731, 9291237999 నెంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.