NRML: నిర్మల్ సబ్‌జైల్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రవీందర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలు, న్యాయపరమైన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు అందుతున్న న్యాయ సహాయం, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
తెలంగాణ
ఖైదీలతో న్యాయ సేవల అధికారి భేటీ


