హైదరాబాద్: 28°C
తెలంగాణ

బొల్లికుంట క్రాస్‌ వద్ద ప్రమాదకర గుంత

WGL: ఖిల్లా వరంగల్‌ మండలం బొల్లికుంట వెళ్లే క్రాస్‌ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ధ్వంసమై భారీ గుంత ఏర్పడింది. గుంత దూరం నుంచి కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు తెలిపారు. ప్రతిరోజూ ముగ్గురు, నలుగురు ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారని, రాత్రివేళ ప్రమాదాల తీవ్రత మరింత పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.