MDK: అవసరమైన సమయంలో యూరియా అందుబాటులో లేక రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి విమర్శించారు. ఎరువుల కోసం దుకాణాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ హామీ ఏమైందో ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. విద్యుత్ కోతలు, ఎరువుల కొరతతో రైతాంగం సతమతమవుతోందని ధ్వజమెత్తారు.
తెలంగాణ
సొసైటీల చుట్టూ తిరిగినా యూరియా దొరకట్ల: ఎమ్మెల్యే


