హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమ దత్తతకు పాల్పడొద్దు: కలెక్టర్‌

HNK: అక్రమ దత్తతకు పాల్పడవద్దని హన్మకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ సూచించారు. హన్మకొండ కలెక్టరేట్‌లో కేంద్ర దత్తత ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం ఎంపికైన ఇద్దరు శిశువులను పుణె, పెద్దపల్లి జిల్లాలకు చెందిన దంపతులకు దత్తత అందించారు. దత్తత ప్రక్రియను నిబంధనల మేరకు చేపట్టాలని కలెక్టర్‌ తెలిపారు.