హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంసీహెచ్‌లో శిశువు మృతి.. విచారణకు హామీ

WNP: ఎంసీహెచ్‌ ఆస్పత్రిలో ప్రసవ సమయంలో శిశువు మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం డిమాండ్‌ చేసింది. వైద్యుల నిర్లక్ష్యమే శిశువు మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రమోహన్‌ స్పందిస్తూ వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి వాస్తవాలు వెలుగులోకి తెస్తామని హామీ ఇచ్చారు.