హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోథ్ ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన MPDO

ADB: బోథ్ మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ వసతి గృహాన్ని MPDO రమేశ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల వసతులు, భోజన సదుపాయాలు, విద్యా బోధనను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.