హైదరాబాద్: 28°C
తెలంగాణ

KPHB ఫేజ్-7 వేలంలో రికార్డు ధరలు

HYD: కేపీహెచ్‌బీ (KPHB) ఫేజ్-7 బహిరంగ వేలంలో భూముల ధరలు రికార్డు సృష్టించాయి. ఒక చదరపు గజం భూమి గరిష్టంగా రూ.2.70 లక్షలు పలికినట్లు హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ తెలిపారు. మొత్తం 16 MIG ప్లాట్లకు నిర్వహించిన ఈ వేలంలో గజం కనీస ధర రూ.1.6 లక్షలుగా నిర్ణయించగా, ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.47.14 కోట్ల ఆదాయం సమకూరింది.