హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యల పరిష్కారానికి కృషి: డిప్యూటీ మేయర్

MBNR: వ్యవసాయం, దాని అనుబంధ వృత్తిదారులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలని కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సంఘటితంగా ఉండి హక్కుల సాధనకు ముందుకు సాగాలన్నారు.