GDWL: ఎర్రవల్లిలో జాతీయ స్కూల్స్ డే సందర్భంగా బుధవారం స్పోర్ట్స్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా MEO అమీర్ పాషా మాట్లాడుతూ.. చదువుతోపాటు క్రీడలు, వ్యాయామంపై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.
తెలంగాణ
ఎర్రవల్లిలో ఘనంగా స్పోర్ట్స్ మీట్


