హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్‌ పోరుబాట

SRD: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ BRS బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట పోరుబాట ప్రారంభించింది. కేటీఆర్ పిలుపు మేరకు ‘కాంగ్రెస్ 1000 రోజుల పాలన.. 420 మోసాలు’ పేరుతో ఏడు రోజుల నిరసనల్లో భాగంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తూ 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శించారు.