HNK: ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు 7వ తరగతి విద్యార్థి అవినాష్‌ను కర్రతో కొట్టడంతో గాయాలైనట్లు తల్లిదండ్రులు తెలిపారు. గతంలో విరిగిన కుడిచేయిని పట్టుకుని లాగుతూ కొట్టాడని ఆరోపించారు. అవినాష్ అండర్-14 తైక్వాండోలో బ్లాక్‌బెల్ట్ సాధించినట్లు తెలిపారు. ఘటనపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
విద్యార్థిని కర్రతో కొట్టిన టీచర్


