NLG: నల్గొండలో ‘జన్-జెడ్’ బహిరంగ సభ ఇవాళ జరిగింది. ఎస్ఎఫ్ఐ ఆలిండియా జాయింట్ సెక్రటరీ ఐషీ ఘోష్ మాట్లాడుతూ.. విద్యార్థుల హక్కులను అణిచివేస్తే సమరశీల ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. విద్యావ్యవస్థ ప్రైవేటీకరణ, నీట్ పేపర్ లీకేజీలు, పాఠశాలల మూసివేతలపై ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
తెలంగాణ
'విద్యార్థుల హక్కులను అణిచివేస్తే ఉద్యమాలు తప్పవు'


