SKLM: బూర్జ మండలం ఒప్పివాడ వెంకంపేట గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ భవనం మంజూరు చేయాలని మండల టీడీపీ ఉపాధ్యక్షులు బుడుమూరు సూర్యారావు బుధవారం ఎమ్మెల్యే కూన రవికుమార్, ఎంపీడీవోలకు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో దళిత కుటుంబాలు ఎక్కువగా ఉన్నా శుభకార్యాలకు వసతి లేదని, 16వ ఫైనాన్స్ నిధుల నుంచి భవనం మంజూరు చేయాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సీ కమ్యూనిటీ భవనం మంజూరుకు వినతి


