హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో వైఎస్ వర్ధంతి వేడుకలు

విశాఖ ఉత్తర నియోజకవర్గం 49వ వార్డు ఏఎస్ఆర్ నగర్‌లో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ అల్లు శంకరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె.కె.రాజు, మహిళా విభాగ అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి పాల్గొన్నారు. జలయజ్ఞం ద్వారా నిర్మించిన ప్రాజెక్టుల నీటితో వైఎస్ఆర్ విగ్రహానికి జలాభిషేకం చేసి నివాళులర్పించారు.