హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి'

WNP: సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెబ్బేర్‌ ఎస్‌ఐ సూచించారు. సైబర్‌ జాగృత దివస్‌ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. OTP, UPI PIN, CVV, పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోవద్దని, అనుమానాస్పద లింకులు, యాప్‌లు,పెట్టుబడి ఆఫర్లకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.