హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొత్తకోటలో లైబ్రరీ ప్రారంభం!

WNP: పుస్తక పఠనంతో జ్ఞానం పెంపొందుతుందని, పోటీ పరీక్షలకు గ్రంథాలయాలు ఎంతో ఉపయోగపడతాయని అదనపు కలెక్టర్‌ టి. వినోద్‌కుమార్‌ అన్నారు. కొత్తకోటలో నూతనంగా ఏర్పాటు చేసిన బీపీ మండల్‌ లైబ్రరీ, స్టడీ హాల్‌ను ఆయన ప్రారంభించారు. స్వశక్తితో గ్రంథాలయం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.