నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని చింత సాయికుమార్, గంగాధర్ లు మద్యం సేవించి వాహనం నడుపుతూ వాహన తనిఖీలలో పట్టుబడ్డారు. వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి, వారిని గౌరవ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ గారి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఇద్దరికీ వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు ధర్పల్లి ఎస్సై సందీప్ తెలిపారు.
తెలంగాణ
డ్రంక్ అండ్ డ్రైవ్.. ఇద్దరికి జైలు శిక్ష


