హైదరాబాద్: 28°C
తెలంగాణ

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

SDPT చేర్యాల స్థానిక నేతాజీ కళాశాల వెనుక గల రాచకొండ అరుణ, బొట్టు చెన్నయ్య ఇళ్లలో జులై 27న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ చోరీకి పాల్పడిన హైదరాబాద్ బండ్లగూడ ప్రాంతానికి చెందిన సయ్యద్ హమీద్ (తండ్రి: మహబూబ్)ను అదుపులోకి తీసుకుని, చేర్యాల కోర్టులో ప్రవేశపెట్టినట్లు SI అపూర్వ రెడ్డి తెలిపారు. నిందితుడికి కోర్టు రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.