కోనసీమ: రావులపాలెంలోని సత్యసాయి సేవా కేంద్రంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు హోమియో వైద్యం, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు గుండె, షుగర్, గ్యాస్ట్రిక్, జనరల్ వ్యాధులకు వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు ఉచిత వైద్య శిబిరం


