MLG: జిల్లాలోని పాలంపేటలోని ‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య కట్టడంగా కేంద్ర ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. ఏఎస్‌ఐ ఆగస్టు 31న జారీ చేసిన ప్రకటనను గెజిట్‌లో ప్రచురించింది. రామప్ప ఆలయానికి నైరుతి దిశలో ఉన్న ఈ త్రికూటాలయం శిల్పకళా విశిష్టతకు ప్రసిద్ధి చెందింది. ఆలయ కుడ్యాలపై విష్ణుమూర్తి, లక్ష్మి, గణేశుడు, మహిషాసురమర్దిని విగ్రహాలు ఉన్నాయి.
తెలంగాణ
‘గొల్లల గుడి’కి జాతీయ గుర్తింపు


