హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారును ఢీకొన్న బైక్‌.. రైడర్‌కు గాయాలు

JGL: కోరుట్ల–వెంకటాపూర్‌ జాతీయ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటాపూర్‌ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. దీంతో అదుపుతప్పి కిందపడటంతో అతడికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.