హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగు జిల్లా కోర్టులో లోక్‌ అదాలత్‌

MLG: జిల్లా కోర్టులో ఈ నెల 12న శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే. చండీశ్వరి దేవి తెలిపారు. రాజీపడదగిన క్రిమినల్‌, సివిల్‌, కుటుంబ, బ్యాంకు, చెక్‌ బౌన్స్‌, మోటార్‌ వాహన ప్రమాదాలు, భూతగాదాలు తదితర కేసులను పరిష్కరించనున్నట్లు తెలిపారు. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.