హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ

MDK: డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ షాపింగ్ విషయంలో సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాష్‌ చంద్రబోస్ సూచించారు. సైబర్ జాగృతా దివస్ సందర్భంగా మెదక్ MJP గురుకుల డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యాశ, భయం, తొందరపాటును ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడతారని తెలిపారు.