హైదరాబాద్: 28°C
తెలంగాణ

పదోన్నతితో బాధ్యత పెరుగుతుంది: ఎస్పీ

GDWL: పదోన్నతి కొత్త హోదాతో పాటు ప్రజలకు మరింత బాధ్యతాయుతంగా సేవలందించే అవకాశం కల్పిస్తుందని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు అన్నారు. కోదండాపురం ఏఎస్సైగా పనిచేసిన వి. శ్రీనివాసులు గౌడ్ ఎస్సైగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఎస్పీ, అ.ఎస్పీ శంకర్ ఆయనను అభినందించి స్టార్ తొడిగారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి విధులు నిర్వర్తించాలన్నారు.