NRML: భైంసా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు సాదు ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం, సంత్ రవిదాస్ మహారాజ్ చిత్రపటాలకు నల్లరంగు పూసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన


