హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం'

KNR: పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం గంగాధర ప్రజా కార్యాలయంలో గంగాధర మండలానికి చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను ఆయన పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.  స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.