హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏటీవోగా రాజగోపాలచారికి పదోన్నతి

NRPT:నారాయణపేట జిల్లా ఎస్టీవో రాజగోపాలచారి ఏటీవోగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. పదోన్నతితో తనపై పెరిగిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని రాజగోపాలచారి తెలిపారు. సమస్యలతో వచ్చే ఉద్యోగులకు అండగా నిలిచి, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.