నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల తరఫున ప్రశ్నించేవారిని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోందని ఆరోపించింది. ఈ దాడిలో వర్షిత్ రెడ్డి తల్లిని కూడా అవమానించారని ఆమె తీవ్రంగా ఆరోపించారు.
తెలంగాణ
'ఇంటిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి'


